Friday, January 17, 2025

ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్‌పేపర్ పద్ధతి లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. “ నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుంది ” అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ ) అధికారి వెల్లడించారు.

దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌యూజీ నిలుస్తోంది. 2024లో 21 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ తరహా లోనే ఈసారి (2025) కూడా నీట్ యూజీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆన్‌లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ) లో నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే తాజాగా కేంద్రవిద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్ పద్ధతికే మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News