మన తెలంగాణ / హైదరంబాద్: అమెరికా గడ్డపైన ఆదాని లంచం కథ కంచికి చేరుకుందని, సొమ్ము జగన్ ఖాతాలో పోగా, 2 లక్షల కొట్లు రూపాయల బారం ఆంధ్ర ప్రజల పై పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో సంపన్న కుటుంబాల కార్ల గుత్తాధిపతి యెలాంముస్క్ లాంటి దిగ్గజాలు ట్రంప్ కు అనుకూలంగా ఒక్కటయ్యారని ఒకవైపు బైడాన్ అంగీకరించారని, మరోవైపు హిడుంబుర్గ్ పరిశోధన సంస్థను మూసివేస్తున్నట్టు సంస్థ యజమానే ప్రకటించేశారని నారాయణ పేర్కొన్నారు.
దీని పరమార్థం ట్రంప్ అమెరికా అధ్యక్షులు అవుతున్నారు. అమెరికా మితవాద ఆర్థికసంస్థలు, భారతదేశంలో ఉన్న ఆదానీలాంటి ఆర్థికసంస్థలు ఒకటవుతారు అని నారాయణ అన్నారు. వీటికి రాజకీయ బలం అటు ట్రంప్ ఇటు మోడీ వెన్నంటి ఉంటారనేది నిస్సందేహం అని నారాయణ అన్నారు. ప్రపంచ కార్మికుల్లారా ఏకంకండి అనే నినాదం అటకెక్కితే , ప్రపంచ దోపిడీవర్గం ఒకటవుతున్నది. అని నారాయణ అన్నారు. ఈనేపథ్యంలో వామపక్షాలన్నీ ఏకం కావలసిన పరిస్థితి ఆసన్నమవుతోందన్నారు.