- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కెసిఆర్ వమనడు హిమాన్షు రావు తన తాతతో కలిసి ఎర్రవెల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేశారు. కెసిఆర్ సూచనలతో హిమాన్షు రావు తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటారు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పారు. ఆ వీడియోను హిమాన్షు రావు ఓ సందేహంతో తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఉత్తముల నుంచి నేర్చుకోవడం అంటూ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు. మన సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు ట్వీట్ చేశారు.
- Advertisement -