Friday, January 17, 2025

ఎదురులేని స్విన్నర్, స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడెడ్‌ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), నాలుగో సీడ్ టి.ఫ్రిట్జ్ (అమెరికా), 13వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), నాలుగో సీడ్ జాస్‌మైన్ పౌలిని (ఇటలీ) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇతర పోటీల్లో పదో సీడ్ డానిల్లె కొల్లిన్స్ (అమెరికా), 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) ఆరో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) తదితరులు జయకేతనం ఎగుర వేశారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా రెండో రౌండ్ లో 60, 62తో స్లొవేనియాకు చెందిన రెబికాను ఓడించింది.

ఆరంభం నుంచే ఇగా చెలరేగి ఆడింది. తొలి సెట్‌లో ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. రెండో సెట్‌లోనూ జోరును కొనసాగిస్తూ అలవోక విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో 9వ సీడ్ డారియా కసట్కినా (రష్యా) జయభేరి మోగించింది. చైనాకు చెందిన వాంగ్ యఫాన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో కసట్కినా 62, 60తో విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ పౌలిని కూడా అలవోక విజయంతో ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో పౌలిని 62, 63తో జరాజువాను ఓడించింది. కాగా, పదో సీడ్ కొల్లిన్స్ చెమటోడ్చి విజయం సాధించింది.

ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఐవాతో జరిగిన పోరులో కొల్లిన్స్ 76, 46, 62తో జయకేతనం ఎగుర వేసింది. కీస్ 76, 26, 75తో రుమేనియాకు చెందిన రూస్‌ను ఓడించింది.28వ సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) కూ డా మూడో రౌండ్‌కు చేరుకుంది. అమెరికా క్రీడాకారిణి కరోలైన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో స్విటోలినా 61, 64తో విజయం సాధించింది. బ్రెజిల్ క్రీడాకారిణి బియార్టిజ్ హద్దాద్ కూ డా రెండో రౌండ్‌లో జయకేతనం ఎగు ర వేసింది. మరోవైపు ఇంగ్లండ్ యువ సంచలనం ఎమ్మా రడుకాను కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో రడుకాను 63, 75తో అమెరికాకు చెందిన అమందా అనిసిమమోవాపై విజయం సాధించింది.

మూడో రౌండ్‌లో జన్నిక్..

పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో సిన్నర్ 46, 64, 61, 63తో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రిస్టన్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో సిన్నర్‌కు చుక్కెదురైంది. ట్రిస్టన్ అద్భుత ఆటతో సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాత సిన్నర్ పుంజుకున్నాడు. తన మా ర్క్ ఆటతో చెలరేగిన సిన్నర్ వరుసగా మూడు సెట్‌లు గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో నాలుగో సీడ్ ఫ్రిట్జ్ విజయం సాదించాడు. చీలికి చెందిన క్రిస్టియాన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో ఫ్రిట్జ్ 62, 61, 60తో జయకేతనం ఎగుర వేశాడు.

మరోవైపు 13వ సీడ్ రూనే రెకాస్త చెమటోడ్చి విజయం సాధించాడు. ఇటలీకి చెందిన బెర్రిటెనితో జరిగిన పోరులోరూనే 76, 26, 63, 76తో జయభేరి మోగించాడు. మరో పోటీలో 17వ సీడ్ టియోఫె విజయం అందుకున్నాడు. ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో హంగేరి ఆటగాడు ఫాబియన్ మరోజ్‌సన్‌ను ఓడించాడు. 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు బోయర్‌తో జరిగిన రెండో రౌండ్‌లో మినార్ 62, 64, 63తో విజయం సాదించాడు. ఇతర పోటీల్లో హుర్‌కాజ్, కచనోవ్, షెల్టన్ తదితరులు జయభేరి మోగించి మూడో రౌండ్‌లో ప్రవేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News