- Advertisement -
ముంబై: రానున్న సిరీస్‌లలో క్రికెటర్లందరూ ఒకే బస్‌లో ప్రయాణించాలనే నిబంధనను అమలు చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా స్వాగతించాడు. ఈ నిర్ణయం భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుందన్నాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ఒకే బస్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు, మ్యాచ్‌కు బయలుదేరి వెళ్లేలా చూడాలని బిసిసిఐ ఆలోచన సరైందేనన్నాడు.
గతంలో తాము క్రికెట్ ఆడే సమయంలో కూడా సీనియర్లు సచిన్, ద్రవిడ్, కుంబ్లే, గంగూలీ, లక్ష్మణ్ తదితరులు ఒకే బస్‌లో స్టేడియానికి బయలుదేరి వెళ్లే వారమని గుర్తు చేశాడు. ఇలా చేస్తే ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందన్నాడు. యువ ఆటగాళ్లకు సీనియర్లపై ఉన్న భయం తొలగిపోతుందన్నాడు. అంతేగాక వారితో కలిసి ప్రయాణించడం కొత్త అనుభూతిని ఇస్తుందన్నాడు.
- Advertisement -