కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాలకు తేల్చిచెప్పిన బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఫిబ్రవరి 19 నుంచి21
వరకు వాదనలు వింటామని వెల్లడి ట్రైబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చుక్కెదురు
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదం పై తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇరు రాష్ట్రాల మధ్య జ లాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రా ష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వాటలను తే ల్చుతామని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంలో ఎపి వాదనలను ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకోకపోవడం గమనా ర్హం. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య నీ టి పంపకాలను సవాల్ చేస్తూ ఏపీ ప్ర భుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ బ్రిజేశ్ ట్రైబ్యునల్ మాత్రం ఆ అం శాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కాగా కృష్ణాజలాలలో 811 టీఎంసీలలో ఏపీ, తెలంగాణలకు ఎంత కేటాయించాలనే అంశంపై బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఈనెల 19 వ తేదీ నుంచి 23వ వరకు విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది. సెక్షన్—-3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచారిస్తామని ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది.
సెక్షన్ – 89, సెక్షన్—3 రెండింటి ప్రకారం విచారించాల ని తెలంగాణ కోరగా, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సెక్షన్‌లు వేర్వేరు కాబట్టి సెక్షన్—3 పై సు ప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సెక్షన్- 89పై విచారించాలని ఏపి ప్రభుత్వం కో రింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అ భ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్షన్–3 ప్రకార మే తొలుత వాదనలు వినాలని విజ్ఞప్తి చే సింది. దాంతో తెలంగాణ ప్రభుత్వ విన తి మేరకు సెక్షన్– 3 ప్రకారం తొలుత వా దనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఎపిలో కేటాయించిన 811 టీఎంసీలలో మెజారిటీ వాటా తమ కు కే టాయించాలని తెలంగాణప్రభు త్వం డి మాండ్ చేస్తోంది.
తెలంగాణకు 299 టీ ఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పం పిణీ ఒప్పందానికి తాము అంగీకరించేది లేదని తెలంగాణ స్పష్టం చేసింది. దాం తో విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసి, ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21 వరకు వాదనలు వింటామని ట్రైబ్యునల్ పేర్కొంది. ఇలా ఉండగా ఢిల్లీలో బుధవారం ఈ అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వాటా దక్కించుకుంటాం
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 811 టిఎంసి కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయమైన వాటాను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ టైబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు.