సమాధానం లేని ప్రశ్నలెన్నో..
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను అగంతకుడు కత్తితో పొడిచింది కోటి రూపాయల కోసమని పోలీసు వర్గాలు ఎన్‌డిటివికి తెలిపాయి. గురువారం తెల్లవారు జామున పశ్చిమ బాంద్రా ఇం ట్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా సైఫ్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అగంతకుడు పిల్లల గదిలోకి ఎలా ప్రవేశించాడు?
అగంతకుడు పిల్లల గదిలోకి ఎలా ప్రవేశించాడన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. ఓ డిటెక్షన్ అనేది లేకుండా ప్రవేశించగలిగాడన్నది స్పష్టం.
వాచ్‌మెన్ ఎలా తప్పించుకున్నాడు?
అనధికారికంగా ఎవరైనా ప్రవేశించారన్నది సొసైటీ సెక్యూరిటీ గార్డ్ కనుగొనలేకపోయాడు. వాచ్‌మెన్ అజాగ్రత్తగా వ్యవహరించాడా? నిఘా సిస్టం కన్నుగప్పి రాగలిగాడా?
లోనికి రావడానికి ఆ బిల్డింగ్‌లో అగంతకుడికి ఎవరైనా తెలుసా?
ఆ ప్రాంగణంలో అగంతకుడు స్వేచ్ఛగా తిరిగాడ న్న దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ బిల్డింగ్ లేఅవుట్ అగాంతకుడికి బాగా తెలిసిందే నా? లేక లోపలి నుంచి ఎవరైనాసాయపడ్డారా?
ఇంట్లో వారి పనేనా?
పోలీసులు సైఫ్ అలీ ఖాన్ స్టాఫ్‌ను, ఆ బిల్డింగ్ పునరుద్ధరణ పనిలో ఉన్న కార్మికులను ప్రశ్నించారు. బిల్డింగ్ లోపలి నుంచి ఎవరైనా సాయపడ్డారా అన్నది కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఇంటితో బాగా పరిచయమున్న వారెవరైనా దాడికి పన్నాగం పన్నారా అన్నది కూడా పోలీసులు విచారిస్తున్నారు.
చాలా సిసిటివిలలో దొరక్కుండా అగంతకుడు ఎలా కన్నుగప్పాడు?
బిల్డింగ్‌లోని ఆరో అంతస్తులో ఉన్న సిసిటివియే అగాంతకుడి చిత్రాన్ని క్యాప్చర్ చేయగలిగింది. సైఫ్ అలీఖాన్ 12వ అంతస్థులో నివసిస్తున్నాడు. ఎంట్రెన్స్‌లో ఉన్న సిసిటివి సహా అనేక చోట్ల ఉన్న సిసిటివిలను తప్పించుకుని అగంతకుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడన్న దాని గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దొంగతనం, మారణాయుధంతో దొం గతనం, ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.