- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగసాగరం వద్ద ఆగి వున్న టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -