Friday, January 17, 2025

వృద్ధురాలు ప్రాణం తీసిన గారె

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: గొంతులో గారె ఇరుక్కొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. తల్లాడ మండల కేంద్రంలో తిరుపతమ్మ అనే వృద్ధురాలు(80) ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న కుమారుడు శ్రీను తన తల్లికి గారెలు ఇచ్చాడు. తిరుపతమ్మ గారెలు తినే క్రమంలో గొంతుల్లో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News