Saturday, January 18, 2025

మంచు కుటుంబంపై రెండు కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: మంచు కుటుంబంలో మళ్లీ వివాదం రేకెత్తింది. డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికలతో పాటు మరో ముగ్గురిపై కేసులు పెట్టారు. మోహన్‌బాబు పిఎతో పాటు ఎంబియు సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద సినీ నటుడు మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు వచ్చానని, అనుమతి కావాలని పోలీసులను మనోజ్ అడగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News