Saturday, January 18, 2025

గంటపాటు పాడి కౌశిక్ రెడ్డి విచారణ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీసుస్టేషన్‌లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్ ఎంఎల్‌ఎ తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్‌లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్ రెడ్డిని మాసబ్ ట్యాంక్ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్న లు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. అయినా కూడా నేను భయ పడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటాను.

డిసెంబర్ 4న నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళా ను. బంజారాహిల్స్ ఎసిపి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు’ అని హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ప్రశ్నించారు. ‘పండుగ రోజు కూ డా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్నే అడి గారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. నేను చేసిన తప్పేమీ లేదు’ అని ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి చెప్పా రు. గతేడాది డిసెంబర్ 4న ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వెళ్లారు. సిఐ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి అనుచరులతో హల్‌చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఎంఎల్‌ఎపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News