షార్ట్‌సర్కూట్‌తో ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన నగరంలోని షేక్‌పేటలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. షేక్‌పేటలోని భవనంలో ట్రెండ్స్‌పైన అంతస్థులో జుహి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో శుక్రవారం తెల్లవారుజాము షార్ట్‌సర్కూట్ వల్ల అగ్నిప్రమాద చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్థులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌కు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి.
భారీగా పొగ వల్ల రెస్కూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అగ్నిమాక సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి ఫెర్టిలిటీ సెంటర్ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం పక్కనే బాయ్స్, ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. పోలీసులు వెంటనే వారిని హాస్టల్స్ నుంచి ఖాళీ చేయించారు. కింద ఉన్న ట్రెండ్స్, డీమార్ట్‌కు మంటలు వ్యాపించకుండా అగ్నిమాక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.