ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లకు లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే వారి బండారం బయటపడుతుందని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు సమయంలో నోట్ల కట్టలు తీసుకువెళ్లమని రేవంత్ రెడ్డికి, ఫార్ములా ఈ -రేసింగ్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించాలని కేటీఆర్‌కు ఎవరు చెప్పారో తెలియాలని అన్నారు. అందుకే ఈ ఇద్దరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్‌లో ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా? అని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కెటిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించి ఇద్దరికి లైడిటెక్టర్ పరీక్షలు అవసరమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, మోసాలపై ప్రజలకు తాము వివరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలను ఢిల్లీకి తీసుకువచ్చి మరీ అక్రమాలు చేశారని ఆరోపించారు.