ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ నిర్దేశిత లక్ష్యంలో
ఇప్పటివరకు 62 శాతమే వసూలు వచ్చే మార్చి
నాటికి పన్నుల లక్షం రూ.85,126 కోట్లు
వనరులపై నివేదికలివ్వాలని అన్ని శాఖలకు నిర్దేశం
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రజలపై అదనపు ఆర్థికభారం పడకుండా ఖజానా ఆదాయం సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్ర భుత్వం దృష్టి సారించింది. అదనంగా పన్నులు పెంచకుండా రాష్ట్రంలో ఆదాయం పెంచాలని అన్ని శాఖలను ప్రభుత్వం తా జాగా ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ఇప్పటి కే మంత్రివర్గ ఉప సంఘం, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమం త్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో పలుమార్లు సమీక్షలు జరిపారు. వచ్చే ఏడాది (2025-26) ఎంత వృద్ధి రేటు నమోదు కావచ్చనే అంచనాలను వెంటనే ఇవ్వాలని శాఖాధిపతులను భట్టివిక్రమార్క ఆదేశించిన ట్లు సమాచారం. ఈ ఏడాది పన్నుల ద్వారా మొత్తం రూ.1.64 లక్షల కోట్లకు పైగా ఆదాయం రావచ్చని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభు త్వం అంచనా వేసింది. అయితే తొలి 9 నెలల్లో (2024 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు) దాదాపు 62 శాతం వచ్చింది. మిగిలిన మూడు నెలలు (జనవరి నుంచి మార్చి వరకు) 38 శాతం వస్తేనే బడ్జెట్ లక్ష్యం నెరవేరుతుంది. పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్ల ద్వారా రూ.54 వేల కోట్లు వస్తుందనుకుంటే అందులో సగం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేస్తోంది.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు, బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) టెండర్ల ఆమోదం వల్ల పన్నేతర ఆదా యం పద్దు కింద భారీగా ఆదాయం వచ్చిందని ఉన్నతాధికారు లు తెలిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల సుంకం ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2023- 24)లో రూ.14,558 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 25 శాతం వృద్ధితో రూ. 18,228 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. దేశమం తా రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ఉందని, అయినా గత ఏప్రిల్ నుంచి నవంబరు వరకు 8 నెలల్లో రూ.9,524 కో ట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ఒడిదొడుకుల కారణంగా 25 శాతం వృద్ధి నమోదు కాకు న్నా గతేడాది కన్నా కొంత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోం ది. మార్చి నాటికి రూ.15,500 కోట్లుదాటవచ్చని అంచనా వేస్తోంది. జీఎస్టీ ఆదాయం కూడా రూ.58,594 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే 8 నెలల్లో రూ.33,766 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2.74 లక్షల కోట్ల లక్ష్యం ఆరు నెలల్లో రూ.1.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. పన్నుల ఆదాయ లక్ష్యం రూ.1.64 లక్షల కోట్లు కాగా సెప్టెంబర్ 30 నాటికి రూ.69,000 కోట్లే వసూలయ్యాయి.
పెరిగిన జీఎస్టీ వసూళ్లు : రాష్ట్రంలో డిసెంబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అత్యధికంగా పెరిగాయి. గతేడాది డిసెంబర్ కంటే రూ.471 కోట్లు అధికంగా వసూలయ్యాయి. 2023తో పోలిస్తే గత ఆరు నెలల్లో రూ.1,277 కోట్లు ఎక్కువ వసూళ్లయ్యాయని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి సామర్థ్యాలు పెరగడంతో పాటు హైదరాబాద్ మార్కెట్ ఎక్కడా తగ్గలేదని జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, ప్రజల ఆర్థిక శక్తి తగ్గిందని, రియల్ ఎస్టేట్‌పై పరోక్షంగా ఆధారపడిన వారి జీవనం కష్టంగా మారిందని, రకరకాలుగా చేస్తున్న ప్రచారం తప్పని ఈ లెక్కలు తేల్చాయి. గత నెలలో కాగ్ ప్రకటించిన లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కడా పడిపోలేదని స్పష్టమైంది. సెప్టెంబర్ నెలలోనూ అత్యధిక వసూళ్లు జరిగాయి. 2023లో రూ.5,226 కోట్లు ఉండగా, 2024లో రూ.5,267 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి నెలల్లో అంతగా ఆదాయం రాలేదు. అయితే దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 6 శాతం తగ్గాయి. కర్ణాటకలో 7 శాతం పెరగగా తమిళనాడులో 11 శాతం, కేరళలో 5 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. దక్షణాది రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఆదాయం ఎందుకు తగ్గింది? : అదనంగా పన్నులు పెంచకుండా రాష్ట్రంలో ఆదాయం పెంచాలని అన్ని శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు)లో నిర్దేశించిన లక్ష్యం రూ.42,034 కోట్లు కాగా అందులో రూ.4,719 కోట్ల మేర తగ్గడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఆదాయం ఎందుకు తగ్గుతోంది…ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎందుకు పెంచలేకపోతున్నామనేది అధ్యయనం చేసి చెప్పాలని సంబంధిత ప్రభుత్వశాఖలకు సూచించింది. ఈ మేరకు ఒడిశా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విధానాలతో పాటు కేంద్రం జీఎస్టీ వసూలులో అమలుచేస్తున్న నూతన విధానాలేమైనా ఉన్నాయా అనేది అధ్యయనం చేయడానికి రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారుల బృందాలను పంపింది.
ఆయా రాష్ట్రాలకు వెళ్లిన బృందాలు క్షేత్రస్థాయిలో అక్కడ పన్నుల వసూళ్ల తీరు ఎలా ఉందనేది పరిశీలించాయి. నెలవారీగా పన్నుల ద్వారా ఆదాయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సమీక్షించారు.ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మద్యంపై అమ్మకపు పన్ను నిర్దేశిత లక్ష్యం రూ.8,079 కోట్లకు గాను మరో రూ.31 కోట్లు పెరిగి రూ.8,110 కోట్లు వచ్చింది. ఇది తప్ప జీఎస్టీ, పెట్రోలియంపై అమ్మకపు పన్ను, వృత్తి పన్ను వంటి ఆదాయాల్లో లక్ష్యాల కంటే తగ్గుదల నమోదైంది. జీఎస్టీపై లక్ష్యం రూ.24,906 కోట్లు కాగా ఏకంగా రూ.4,086 కోట్లు తగ్గి రూ.20,820 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలింది. 16 శాతానికిపైగా తగ్గడం ఏమిటని వాణిజ్యపన్నుల అధికారుల పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. పన్నుల వసూళ్లు ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించింది. పెట్రోలియంపై అమ్మకపు పన్ను లక్ష్యం రూ.8,606 కోట్లకు గాను రూ.654 కోట్లు, వృత్తిపన్ను రూ.437 కోట్లకు గాను రూ.17 కోట్లు తక్కువగా వచ్చింది.
నూరు శాతం సాధించేనా : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి నాటికి పన్నుల ద్వారా మొత్తం రూ.85,126 కోట్లు రాబట్టాలనేది లక్ష్యం. ఇందులో తొలి 6 నెలల నిర్దేశిత లక్ష్యంలో తగ్గుదల నమోదు కావడంతో వచ్చే మార్చి నాటికి వం దశాతం లక్ష్యం సాధించేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లలో పారదర్శకత పెంచాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిట్‌లు విస్తృతంగా నిర్వహిస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయగా అక్కడ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు వాణిజ్యపన్నులశాఖలో విడిగా పనిచేస్తున్నాయని, రోజూవారీ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ పనులు లేకపోవడం వల్ల పన్నుల వసూళ్లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తేలింది. తెలంగాణ వాణిజ్యపన్నులశాఖలో పనిచేసే సిబ్బందికి వృత్యంతర శిక్షణ లేకపోవడం వల్ల ఆధునిక పరిజ్ఞాన వినియోగం, వసూళ్ల పెంపులో నూతన విధానాలు తెలియడం లేదని గుర్తించారు.
సవాలుగా బడ్జెట్ లక్ష్యం : 2024- 25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.2.74 లక్షల కోట్ల ఆదాయ ఆర్జనను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఈ ఆరు నెలల్లో రూ.1.08 లక్షల కోట్ల (39.41 శాతం) ఆదాయం మాత్రమే వసూలైంది. బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.1.64 లక్షల కోట్ల పన్నుల ఆదాయంలో, సెప్టెంబర్ 30 నాటికి రూ.69,000 కోట్లు మాత్రమే వచ్చింది. రూ.13,000 కోట్ల లోటు ఏర్పడింది. దీంతో పథకాల అమలు సవాల్‌గా మారింది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బీరుకు రూ.20, భారతీయ తయారీ విదేశీ మద్యంలో ప్రతీ క్వార్టర్ బాటిల్‌కు రూ.20 నుంచి రూ.70 వరకు ధరలు పెంచే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.
తద్వారా నెలకు అదనంగా రూ.1,000 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని, కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ఆస్థి, రిజిస్ట్రేషన్ల ఫీజుల పెంపు జోలికి వెళ్లడం లేదని తెలిసింది. ప్రభుత్వం భూములను అమ్మేందుకు కూడా చర్యలు చేపట్టింది. ప్రైమ్ ఏరియాల్లోని ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి, వేలం వేయడానికి ప్రతిపాదనలు పంపాలని హెచ్‌ఎండీఏతో పాటు అన్ని పట్టణ అభివృద్ధి సంస్థలను ఆదేశించింది. రాజీవ్ గృహకల్ప వంటి పథకాల కింద అమ్మకానికి లేని ఫ్లాట్లను విక్రయించడంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్రం ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థల నుంచి బకాయి వసూలుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది,. ప్రైవేట్ కంపెనీలతో కలసి నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశారు. పన్నులు, జరిమానాల చెల్లింపులో ప్రజలను ప్రోత్సహించేలా వన్-టైం సెటిల్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.