Saturday, January 18, 2025

ఏ ఒక్క ఊరిలో వందశాతం రుణమాఫీ జరిగినా మూకుమ్మడి రాజీనామా

- Advertisement -
- Advertisement -

రైతులందరికీ రుణమాఫీ జరిగినట్లు
నిరూపిస్తే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలందరం
రాజీనామా చేస్తాం నేను రాజకీయ సన్యాసం
స్వీకరిస్తా సిఎం రేవంత్‌కు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
సవాల్ రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో
జరిగిన రైతు ధర్నాలో ప్రసంగించిన
బిఆర్‌ఎస్ నేత ఆరు గ్యారంటీల
అమలులో రేవంత్ సర్కార్ ఘోరంగా
విఫలమైందని విమర్శ

మన తెలంగాణ/షాబాద్ : ప్రభుత్వాధి నేతలు చె బుతున్నట్టు ఏ ఊర్లో అయినా రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తమ పార్టీ ఎంఎల్‌ఎలం తా రాజీనామా చేయడానికి సిద్ధమేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేశారు. రంగారెడ్డి జి ల్లా, షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్ర భుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి ఢిల్లిలో స్వీచ్ ఇస్తూ ..తెలంగాణలో ఆరు గ్యారంటీలను 100 రోజులలో అమలు చేశామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు అధికా రం ఇస్తే తెలంగాణను ఉద్ధరించినట్టు ఢిల్ల్లీని కూ డా ఉద్ధరిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందని, అది మహిళల కు ఫ్రీ బస్సు మాత్రమేనని అన్నారు. అమ్మకు అ న్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చే యిస్తాడా..? గూట్ల్లో రాయి తీయనోడు ఏట్లో రా యి తీస్తాడా.?తెలంగాణను ఉద్ధరించనోడు ఢిల్ల్లీ ని ఉద్ధరిస్తాడా..?అనిప్రశ్నించారు.రుణమాఫీఅమలు చేయలేని ఈ ప్రభుత్వంపై 420 కేసు నమోదు చేయాలన్నారు.ఎందుకంటే..రైతులను పూర్తిగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊరికినే వద్దిలి పెడదమా అన్నారు. ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణ మాఫీ అయిందని అంటే తాను రాజీనామా చేయడమే కాదు, రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అయినా సరే డేటు, టైం, ఎక్కడైనా సరే నువ్వు రాకుంటే నీ మంత్రులను పంపి, అక్కడే 100 శాతం రుణమాఫీ అయిందని రాసి ఇస్తే మొత్తం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలంతా రాజీనామా చేసి వెళ్తాం’ అని స్పష్టం చేశారు.

ఎలక్షన్‌లప్పుడు కెసిఆర్ రైతుబంధు కోసం ఉంచిన డబ్బులను 7 వేల 6వందల కోట్లను రైతులకు వేయకుండా ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి వేయనీయకుండా చేసిండని మండిపడ్డారు. వానాకాలం పంటకు కూడా రైతులకు డబ్బులు వేయకుండా సిఎం తప్పించుకున్నాడని మండిపడ్డారు. షాబాద్‌లో ఈరోజు ప్రారంభించిన రైతు ధర్నా ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రమంతా రైతు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కొక్క ఎక్కరానికి ఒక్కొక్క రైతుకు రూ.17500 బాకీ ఉన్నాడని, వాటిని వసూలు చేసుకోవాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు ప్రచారం కోసం వచ్చే కాంగ్రెస్ సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలను, ఆ పార్టీ నాయకులను రైతులకు ఇవ్వాల్సిన రూ.17,500 బాకీ ఇవ్వాలని, అప్పుడే ఓట్లు అడగాలంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడకు పోయిందని, ఎందుకు ఇస్తాలేవ్ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 5 లక్షల మంది ఆడ్డబిడలు పెళ్లిళ్లు చేసుకున్నారని ఒక్కొక్కరికి రూ.80 వేలు బాకీ ఉన్నాడన్నారు. చేవెళ్లలో రేపు ఉప ఎన్నిక వస్తుందని, ఒక్క చేవెళ్లలోనే కాదు.. రాష్ట్రంలో 10 మంది ఎంఎల్‌ఎలు పార్టీ మారారో 2025లోనే ఆయా సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.

రైతు భరోసా ఇయ్యనందుకు, రుణమాఫీ చేయనందుకు, ఆరు గ్యారంటీలను అమలు చేయనందుకు, కొడంగల్‌లో భూములు ఇవ్వడానికి నిరాకరించినందుకు 40 మంది రైతులను 40 రోజులు జెల్లో పెట్టినందుకు, రైతులను మోసం చేసినందుకు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు పేద ప్రజల పక్షాన కోట్లాడుతనే ఉంటామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తాము చేసే విజ్ఞప్తి జనవరి 26 నుండి రూ.15 వేలు భరోసా నఇవ్వాలని, రాష్ట్రంలోని 22 లక్షల కౌలు రైతులకు కూడా ఇవ్వలన్నారు. భూమి లేని పేదలకు సంవత్సరానికి, రైతు కూలీలకు కూడా రూ.12 వేలు ఇస్తానన్నారు ..అవి కూడా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి , శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అలీ, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎంఎల్‌ఎసి నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. తొలుత కెటిఆర్‌కు షాబాద్‌లో మాజీ జడ్‌పిటిసి పట్నం అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా గులాబీల వర్షం కురిపించారు. వివిధ మండలాల నాయకులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News