సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా
స్కిల్ వర్శిటీ మధ్య ఒప్పందం
స్కిల్ వర్శిటీలో ఐటీఈ పాఠ్యాంశాల
బోధనకు అంగీకారం సిఎం
రేవంత్‌రెడ్డి సమక్షంలో సంతకాలు
హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు
శుక్రవారం నుంచే ప్రారంభమైన
సిఎం విదేశీ పర్యటన సింగపూర్
విదేశాంగ మంత్రి బాలకృష్ణతో
ముఖ్యమంత్రి భేటీ మూసీ
పునరుజ్జీవం, గ్రీన్ ఎనర్జీ తదితర
అంశాలపై చర్చ
పెట్టుబడుల సేకరణే లక్షంగా ప్రారంభమైన సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన శుక్రవారం నాడు శుభారంభమైంది. సిఎం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ సింగపూర్‌లోని ఐటీఈ విద్యాసంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర రాజధాని చేరువలో ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో ఈ వర్శిటీని స్థాపించనున్నారు. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్శిటీలో బోధించే విషయమై ఈ రెండు విద్యాసంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అదేవిధంగా తన బోధనా సిబ్బందికి ఐటీఈలో శిక్షణ ఇప్పించడానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తున్నది. స్కిల్ వర్శిటీలో నాణ్యమైన విద్యాబోధనకు ఇది బీజం వేయనున్నది.
మన తెలంగాణ/హైదరాబాద్ :ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో మొదటిరోజు విశేష స్పందన లభించింది. సిఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా కీలక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి సింగపూర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో సింగపూర్ ఐటీఈ ‘ది ఇ నిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్’తో తెలంగాణ యంగ్ ఇం డియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒ ప్పందంలో భాగంగా ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్శిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ విసి, ఐటీ ఈ డిప్యూటీ డైరెక్టర్‌ల మధ్య ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎ డ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ ర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెం ట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్క డ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి సిఎం మాట్లాడారు. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్‌లోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్‌ను సందర్శించనున్న ఐటీఈ బృందం
వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరు ను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. నైపుణ్యా ల అభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కో సం పరస్పర సహకారం అందించాలని మంత్రి కోరారు. దీనిపై సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చే సేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన
ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై యూనివర్సిటీ విసి సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకాడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించనుంది.
సింగపూర్ విదేశాంగ మంత్రితో సిఎం భేటీ
కాగా, శుక్రవారం ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సిఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయనతో విస్తృత చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవనం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి అంశాలపై వివిఎన్ బాలకృష్ణతో వారు చర్చలు జరిపారు. విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
సింగపూర్‌లో 28 వేల మంది విద్యార్థులకు శిక్షణ
సింగపూర్‌లో ఐటీఈ, పదో తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో అక్కడ ఉద్యోగ శిక్షణను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో సింగపూర్ ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో, క్యాంపస్ శిక్షణలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ఐటీఈలకు ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు ఐటీఈలో నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో రాష్ట్రంలో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది. తాజా ఎంఓయూ వల్ల సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
విమానాశ్రయంలో ప్రవాసుల సందడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రెండు దేశాల పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధి బృందానికి సింగపూర్‌లో ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వస్తున్నారన్న సమాచారంతో సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసుల సందడి నెలకొంది. వారందరూ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం కావాలని సిఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు.