- Advertisement -
హైదరాబాద్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానూ తాండాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండడంతో అన్నకు తమ్ముడు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. నానూ తాండాలో శంకర్, గోపి అనే అన్నదమ్ములు ఉండేవారు. శంకర్ విద్యుత్ షాక్ తో చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని పోలీసులు భావించారు. శంకర్ మృతిపై అనుమానాలు ఉండడంతో తమ్ముడు గోపిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -