Saturday, January 18, 2025

కారులో డ్రాప్ చేస్తామని బాలికలపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కారులో డ్రాప్ చేస్తామని చెప్పి ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలో బెళగావి ప్రాంతంలో జరిగింది. ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సేవదత్ గ్రామంలో బాలికలు నడుచుకుంటూ వెళ్తుండగా కారులో డ్రాప్ చేస్తామని కత్రుక్ బాను, అదిల్ షా, అభిషేక్ అనే యువకులు వారిని నమ్మించారు. కారులో ఎక్కిన తరువాత బాలికలను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై ముగ్గురు అత్యాచారం చేయడంతో పాటు వీడియో తీశారు. వీడియో సహాయంతో బాధితులను గోవాకు రావాలని బ్లాక్ మెయిల్ చేయడంతో బాలికలు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. బాధితుల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితుల ఫోన్లలో వీడియో ఉండడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News