Saturday, January 18, 2025

జెసి ప్రభాకర్ రెడ్డిపై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ లో నటి మాధవీలత టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. జెసి తనపై అసభ్యకర వాఖ్యలు చేశారని హెచ్ఆర్సి, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. జెసి నాపై దారుణంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశానని వివరించారు. ‘మా‘ ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించడంతో పాటు ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్టు దృష్టికి తీసుకెళ్లారన్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వం హననం చేయడం దారుణమని మాధవీలత మండిపడ్డారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి కానీ వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరైనది కాదని శివబాలాజీ చురకలంటించారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దు అని అన్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ‘మా’ ట్రెజరర్ మా శివబాలాజీ తెలిపారు. మాధవీలత చేసిన వ్యాఖ్యలకు జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News