హైదరాబాద్: లక్షలాది మంది ముందే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనని పెళ్లి చేసుకొని భార్యగా ఇంటికి తీసుకొచ్చారని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి తెలిపారు. 29 ఏళ్లుగా దుర్మార్గులు తనని వేధిస్తున్నారని, ఇప్పటికీ తన జీవితాన్ని నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశానని, చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన తనని వదిలేసి వెళ్ళిపోయారన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 29 వర్ధంతి సందర్భంగా ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళుల్పరించారు. అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిఆర్ దూరం కావడంతో 29 ఏళ్లుగా మనోవేదనపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి వారు సోషల్ మీడియాలో తన ఫోన్ నంబర్ పెట్టడంతో రోజుకు 1000 మంది ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు అనుకున్నా అనుకోకున్న మీ అత్తాగారినేనని, ఇలాంటి అవమానం జరుగుతుంటే బాబు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. తన దగ్గర డబ్బులు ఉన్నాలేకున్న ఎవరినీ చేయిచాచి అడగలేదని, ఎన్‌టిఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నానని, తన మీద కక్ష ఎందుకు అని అడిగారు.
29 ఏళ్లుగా దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు: లక్ష్మీ పార్వతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -