Sunday, January 19, 2025

త్వరలో హౌసింగ్ పాలసీ

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు
తరహాలో ఇళ్ల నిర్మాణం 100
ఎకరాల్లో టౌన్‌షిప్‌లు మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో
ఇళ్ళ నిర్మాణాలు వంద ఎకరాల్లో
ఇటౌన్ షిప్‌లను నిర్మిస్తాం మంత్రి
పొంగులేటి వెల్లడి హిమాచల్ ప్రదేశ్
హౌసింగ్ మంత్రితో భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ‘తెలంగాణ అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ, హౌసి ంగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో మధ్య తరగతి ప్రజానీకం కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని, కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్ షిప్‌లను నిర్మించి మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటితో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మంత్రి రాజేష్ ధర్మాని సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న గృహనిర్మాణ పథకాల గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. హౌసింగ్ నియమ నిబంధనల మేరకు, అందుబాటులో ఉన్న బోర్డు స్థలాలలో కొత్తగా గృహనిర్మాణానికి సంబంధించిన పథకాలను అమలు చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా
నిరుపేదలకు శాశ్వత గృహాలు
ప్రైవేటు, ప్రభుత్వరంగ భాగస్వామ్యంతో అఫర్డబుల్ గృహ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ననుసరించి ఆస్తులు, అప్పుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకునే సౌలభ్యం కల్పించామని, 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యం ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు. 15 వేల ఎక రాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని పొంగులేటి హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేష్‌కి ధర్మాని తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News