- Advertisement -
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందుతుడు అరెస్ట్ అయ్యాడు. ఘటన జరిగినప్పటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ముంబయి పోలీసులు.. శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్ట్ చేశారు. నిందితుడు వెయిటర్ విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. ఇటీవల సైఫ్ నివాసంలోకి చొరబడిన విజయ్.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. వెన్నుముకలో కత్తిపోటు దిగడంతో వైద్యులు సర్జరీ చేసి ప్రాణపాయం తప్పించదని వెల్లడించిన సంగతి తెలిసిందే.
- Advertisement -