- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలకు చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడో ఓ చోటు నిత్యం డ్రగ్స్, గంజాయి పట్టుపడుతున్నాయి. తాజాగా మాదాపూర్‌లో గంజాయి, హాష్ ఆయిల్ కలకలం రేపింది. 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్ ఆదివారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్‌గా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడల్లో విద్యార్థులకు గంజాయి అలవాటు చేసిన గ్యాంగ్.. మాదాపూర్ సిద్ధిఖీనగర్‌లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -