Sunday, January 19, 2025

పసుపు బోర్డు ప్రారంభానికి పిలవకపోవడం బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం పసుపు బోర్డుపై కవిత మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డు ప్రారంభ కార్యక్రమానికి మమ్మల్నీ పిలవకపోవడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

పసుపు బోర్డ్ పోరాటం ప్రారంభించిందే తామని.. ఎంపీ అరవింద్‌ వెకిలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే స్పైసెస్‌ బోర్డు ఏర్పాటైందని.. పసుపు రైతుల కోసం త్రిముఖ వ్యూహం ఉండాలన్నారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కవిత అన్నారు. కాగా, పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News