Monday, January 20, 2025

కాంగ్రెసోళ్లు అందుకే అందినకాడికి దండుకుంటున్నారు: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా? అని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
అధికారుల మీద మంత్రులకు పట్టు ఉందా? అని అడిగారు. అధికారుల బ్రోకర్ల లాగా మారిపోయి వేధిస్తున్నారని,
50 వేల నుండి 2 లక్షల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 7 నుంచి10 శాతం లంచం ఇస్తే తప్ప బిల్లు బయటకు రాని పరిస్థితి నెలకొందని, ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా దుఃఖానాలు తెరిచారని, అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని పాలన రేవంత్ రెడ్డి పాలన అని ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అని అందినకాడికి దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.  జవహర్ నగర్ కూల్చివేతలపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.  పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇది నిజాం సర్కార్ కాదు అని, బాస్ ల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు, పోలీసులు మారకపోతే శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

బిజెపి నేతలు బద్దం బాల్ రెడ్డి, దత్తాత్రేయ, నరేంద్రలు అండగా నిలబడి పేదలకు ఇల్లు ఇప్పించారని,  బిజెపి నాయకులు పేదలకు అండగా ఉన్న చరిత్ర ఉందని, నిర్భందాలకు ఎదిరించి నిలబడ్డారని కొనియాడారు. ఆ గూడు చెదరగొట్టాలని ప్రయత్నిస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. బిజెపి పార్టీ ఎదుగుదుల ఇష్టం లేనివారు అబద్దాల పుట్టిస్తారని, అలాంటి వాటిని తాము పట్టించుకోమన్నారు. మల్కాజిగిరిలో ఓడిచడం రేవంత్ జేజమ్మ తరం కాదు అని అప్పుడు చెప్పానని, ఇప్పుడు చెప్తున్నా.. రాబోయే రోజుల్లో బిజెపిని ఓడించడం ఎవరి తరం కాదన్నారు. రేపటి శకం బిజెపిదిననే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News