Monday, January 20, 2025

ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల కోసం హౌసింగ్ శాఖను పునరుద్ధరించాం
హౌసింగ్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : కూడు గూడు గుడ్డ..గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుండెల్లో కొలువైందని, అలాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నిక్ల ప్చ్రారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగు సంవంత్సరాల్లో దశల వారీగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. పేదలకు ఇళ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేసిందని, ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖను పునరుద్ధరించి లబ్దిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం, అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుందన్నారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆరు గ్యారంటీల పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల థకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు ఐదు లక్షల రూపాయల స్కీమ్ తో పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని,దానికి గృహనిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించాలని, మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకట రామిరెడ్డి, సేనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కుమార్, రమేష్, రఘు, లింగయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News