- Advertisement -
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మాలేపూర్ ఘాట్‌లో యాత్రుకులతో వెళ్తున్న వాహనం బోల్తాపడడంతో 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన 60 మంది ఆదివాసీలు జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -