ఘట్కేసర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిపై డిసిఎం బ్రేక్ లు ఫెయిల్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది యాదగిరి గుట్టకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది,.
- Advertisement -