Monday, January 20, 2025

ఐటి క్యాపిటల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో రూ.450కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

10 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటి పార్క్ నిర్మాణం సిఎం రేవంత్‌రెడ్డి
సింగపూర్ పర్యటనలో క్యాపిటాల్యాండ్‌తో ఒప్పందం హైదరాబాద్
అభివృద్ధిలో మరో మైలురాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఐటి పార్కు
సింగపూర్ నదిలో సిఎం రేవంత్‌రెడ్డి పడవ ప్రయాణం నదీ పునరుద్ధరణ,
నీటి నిర్వహణ, అధునాతన భవనాల నిర్మాణం తదితర అంశాలపై పరిశీలన

మన తెలంగాణ/హైదరాబాద్: సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సిం గపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటాల్యాండ్ ఈ నిర్ణయం ప్రకటించింది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం వో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్ ల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు. క్యాపిటాల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.. క్యాపిటల్‌ల్యాండ్ నిర్ణయాన్నిస్వాగతించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయా లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి. ఈ సం దర్భంగా గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందన్నారు. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్, అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.

IT Capital in Hyderabad

సింగపూర్ నదిలో సీఎం రేవంత్ రెడ్డి పడవ ప్రయాణం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడుల నేపథ్యంలో సీఎం రేవంత్ టీమ్ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, అక్కడి నది పునరుద్ధరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, నదుల పునరుజ్జీవనం సిటీ -స్టేట్ అనుసరించిన ఉత్తమ పద్ధతులు తెలుసుకున్నట్లు తెలిపారు. నీటి నిర్వహణలో పురోగతి, వారసత్వ భవనాల పునరుద్ధరణ, అద్భుతమైన కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలు, పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం గమనించినట్లు పేర్కొన్నారు.
ఇలా వరల్డ్ క్లాస్ హైదరాబాద్‌ను క్రియేట్ చేయడానికి మనం ఇంకా ఉత్తమ పద్ధతులను స్వీకరించడం నేర్చుకోవాలని, మనం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News