Monday, January 20, 2025

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీలో మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉండటంతో ఇండోర్ స్టేడియంలో ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, పలువురు ప్రతినిధులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. భారత్ నుంచి ఇప్పటికే అంబానీ దంపతులు అమెరికా చేరుకుని.. ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తరపున ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి విదేశాంగమంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. కాగా, ప్రమాణం అనంతరం ట్రంప్ మొదటగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లపై సంతకం చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News