Monday, January 20, 2025

నాగర్ కర్నూల్ లో అక్రమ మైనింగ్‌.. తెల్లవారుజామున రైతుల అరెస్టులు.. గ్రామస్తుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: జిల్లాలో బల్మూర్ మండలంలోని మైలారం గ్రామం గుట్టపై అక్రమ మైనింగ్ చేపట్టొద్దని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ‘మైనింగ్ వద్దు-గుట్ట ముద్దు’ అనే నినాదంతో రిలే నిరాహార దీక్ష చేయాలని మైలారం గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో పోలీసులు గ్రామంలోని కొంతమంది రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సోమవారం ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో పొలంలో పనులకు వెళ్తున్న సమయంలో పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నిర్భందించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన గ్రామస్తులను వెంటనే విడుదల చేయకపోతే మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని నిరసనకు దిగారు. పురుగుల మందు డబ్బులతో రోడ్డెక్కిన మహిళా రైతులు.. పోలీసులు గ్రామానికి రాకుండా ముళ్ళకంచ ఏర్పాటు చేసిన ఆందోళనకు దిగారు.

కాగా, రాజకీయ నాయకుల అండదండలతోనే కాంట్రాక్టర్ అక్రమ మైనింగ్ చేపట్టాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులతోపాటు ఎమ్మెల్యేను కలిసి అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని కోరినా స్పందించడంలేదని మైలారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్తున్న రైతులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికారులు.. కాంట్రాక్టర్ కు అండగా ఉంటున్నారని.. అందుకే గ్రామస్తులను మైనింగ్ వైపు వెళ్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News