Monday, January 20, 2025

వంతారాకు 2 ఇస్కాన్‌ ఏనుగులు

- Advertisement -
- Advertisement -

జామ్‌నగర్‌: కోల్‌కతా సమీప ప్రాంతం మయాపూర్‌ ఇస్కాన్‌ నుంచి గుజరాత్‌ జామ్‌నగర్‌లోని వంతారాకు రెండు ఏనుగులను తరలించనున్నారు. ఈ ఏనుగులకు ప్రముఖ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వంతారా సంస్థ ఆశ్రయం కల్పించనుంది. జంతువులకు సురక్షితమైన వసతులతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం అనంత్‌ అంబానీ ఈ సంస్థను స్థాపించారు.

గతేడాది ఏప్రిల్‌లో బిష్ణు ప్రియ అనే ఏనుగు మావటిపై దాడి చేసింది. వాటికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ఇస్కాన్‌ సిబ్బంది భావించారు. ఈ క్రమంలోనే వంతారా, ఇస్కాన్‌ మధ్య ఏనుగుల బదిలీ ప్రక్రియ కార్యరూపం దాల్చింది. దీనికి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ అంగీకరించగా.. సుప్రీం కోర్టు ఆమోదించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల బిష్ణుప్రియ, 26 ఏళ్ల లక్ష్మీప్రియ అనే ఏనుగులను వంతారాకు తరలించనున్నారు. వాటిని అక్కడ జీవిత కాలంపాటు సంరక్షించనున్నారు. వాటి మానసిక స్థితి మెరుగైన తర్వాత మిగతా ఏనుగుల గుంపులో వాటిని కలుపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News