Tuesday, January 21, 2025

మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నాల్ని సహించం : అజిత్ పవార్

- Advertisement -
- Advertisement -

లౌకిక రాజకీయాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని, రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేసే ప్రయత్నాలను తాము సహించబోమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. సోమవారం ఆయన జల్నాలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సారథ్యం లోని ఎన్సీపీలో కళంకిత వ్యక్తులకు చోటు ఉండదని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ఎప్పుడూ ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక సామరస్యానికి నిలయం. ఎన్సీపీ ఐక్యమత్యం , లౌకిక వాదం, వైపే నిలబడుతుంది. వివిధ వర్గాల్లో విద్వేష బీజాలను నాటే వారిని విభజన రాజకీయాల్లో పాల్గొనే వారిని మేం సహించం. కళంకిత వ్యక్తులను మన పార్టీలో చేర్చుకోవద్దు ” అని పార్టీ శ్రేణులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News