మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి
మైలారం గ్రామస్తుల ఆందోళన
గ్రామంలోకి అధికారులు రాకుండా ముళ్ళ కంచే ఏర్పాటు
పోలీసులతో వాగ్వాదం.. పురుగు మందు డబ్బాలతో హెచ్చరిక
పోలీసుల అదుపులో గ్రామస్తులు
పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదం
వెల్దండలో ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో జరుగుతున్న మైనింగ్ పనులపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. మైనింగ్ ను నిలిపివేయాలని, మైనింగ్ వల్ల గ్రామానికి తమకు తీరని ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు మైనింగ్ పనులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్లకంచెలను ఏర్పాటు చేసి గ్రామంలోకి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు తీవ్రస్థాయిలో వాగ్దేవి వాదానికి దిగారు.
అరెస్టు చేసిన గ్రామస్తులను వెంటనే వదిలిపెట్టాలని క్రిమిసంహారక మందుల డబ్బాలు చేతబడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పలువురు వారిని వారించారు. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్ ను అరికట్టాలని గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ప్రొఫెసర్ హరగోపాల్ మైలారం గ్రామానికి వస్తుండగా పోలీసులు వెల్దండ మండల కేంద్రంలో అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటింగ్ బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే.
నాగర్ కర్నూల్ జిల్లా బాల్మూర్ మండలం మైలారం గ్రామంలోని సర్వే 121 లోని భూమిలో క్వర్జ్ తవ్వకాలకు కేటాయించిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని సర్వే నంబర్ 121 లో 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో గుట్టగా ఉన్న 35 ఎకరాలను క్వార్జ్ తవ్వకాల కోసం మైనింగ్ శాఖ కొందరికి అనుమతులు ఇచ్చింది. కొద్ది రోజుల నుంచి అక్కడ తవ్వకాల పక్రియ మొదలైంది. కాగా మైనింగ్ వలన ప్రకృతి సహజ సంపదతో పాటు.. తమ భూములు, ఇల్లు దెబ్బతినే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేప్పాటలని పిలుపునిచ్చారు. తమ నిరసనను పౌర హక్కుల నేతలు హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ ను ఆహ్వానించారు.
అలాగే గ్రామంలోకి అధికారులు, మైనింగ్ నిర్వాహకులు రాకుండా గ్రామంలోని రోడ్డుపై ముళ్ళ కంచే, రాళ్ళు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో సిఐ రవీందర్, ఎస్ఐ రమాదేవి గ్రామానికి వెళ్లి ప్రజలకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినకపోవడంతో కొందర్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో కొంత మంది మహిళలు పురుగు మందు డబ్బాలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అందర్నీ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. పౌర హక్కుల సంఘం నేతలను వెల్దండ వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. మైలారం గ్రామస్తులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్
పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మ లక్ష్మణ్ లను పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పోలీసులుbఅరెస్ట్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామంలో అక్రమ మైనింగ్, కాడ్జ్ తవ్వకాలను ఆపేయాలని ఆ గ్రామ ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా వెళ్తున్న వారిని వెల్దండ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రజలు చెప్పేది ప్రభుత్వాలు వినాలని ప్రజలకు మేలు చేయడానికి వెళుతుంటే అడ్డగించడం తగదని , ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు.