Tuesday, January 21, 2025

మందుబాబులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మందుబాబులకు బీర్ల సరఫరా సంస్థ శుభవార్త చెప్పింది. నిలిచిపోయిన కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలో బీర్ల ధరలు పెంచాలని, పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌తో బీర్ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో బీర్ల నిల్వలు భారీగా పడిపోయాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ (యూబిఎల్) సంస్థ కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం తెలిపింది. సెబీ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు యూబిఎల్ సంస్థ ప్రకటించింది.

తాము టిజిబిఎల్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతోంది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి సమస్యలను బేవరేజెస్ కార్పొరేషన్ సమాయనుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చింది. ఈ చర్చలు మరింత కాలం కొనసాగుతాయని, వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్యా ప్రస్తుతానికి టిజిబిఎల్‌కు బీర్ల సరఫరాను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు యూబిఎల్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యూబిఎల్ వెల్లడించింది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ కంపెనీ తెలిపింది. కాగా, బీర్ల తయారీ ప్రకటనతో ఆ సంస్థ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News