Tuesday, January 21, 2025

ఇది ప్రజాపాలన కాదు ఇది..నిర్బంధ పాలన:హరీష్‌ రావు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం అని పేర్కొన్నారు. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగారు.

ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన రేవంత్‌రెడ్డి కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఎం సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇది ప్రజాపాలన కాదు .. ప్రజలను పీడించే పాలన : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మేధావులు ఇప్పటికైనా భ్రమలు వీడాలని ఒక ప్రకటనలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News