Tuesday, January 21, 2025

మహాకుంభమేళాలోని కిన్నర్ అఖాడ వద్ద అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

మహాకుంభ్‌మేళాలో సెక్టార్ 16లోని కిన్నర్ అఖాడ క్యాంప్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వరంగా ఆర్పేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెక్టార్ 19లో సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న మరునాడే ఈ ఘటన జరగడం గమనార్హం. ఉదయం 9.30 గంటలకు అన్ క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న సిబ్బంది పొగను గమనించి కంట్రోల్ రూమ్‌కు వెంటనే సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి వెళ్లేలోగానే అక్కడున్న ప్రజలు ఇసుక, నీరుతో మంటలను ఆర్పేశారు. ‘ఇన్‌స్పెక్షన్‌లో శ్రీహరి దివ్య సాధన పీఠ్ క్యాంప్ వద్ద చిన్న గుడారంకు నిప్పంటుకుందని తేలింది. ఎవరికి గాయాలు కానందుకు ఆనందంగా ఉంది’ అని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News