Tuesday, January 21, 2025

పాకిస్థాన్ లో అతి పెద్ద విమానాశ్రయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

చైనా సహకారంతో పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రాంతంలో అతిపెద్ద విమానాశ్రయంను నిర్మించింది. ఈ విమానాశ్రయం సోమవారం నుంచి తన ఆపరేషన్స్‌ను ప్రారంభించింది. ఈ విమానాశ్రయంలోకి పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ పికె 503 విమానం రాకతో ప్రారంభమయింది. దీంతో కమర్షియల్ ఫ్లయిట్స్ రాకపోకలకు మార్గం సుగమం అయింది. పికె 503 విమానం కరాచీ నుంచి 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి, ఒక గంట 10 నిమిషాలు పయనించి చివరికి ఈ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానాశ్రయంలో ఆధునిక వసతులున్నాయి. గ్వాదర్ నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో గురండానిలో ఉన్న ఈ విమానాశ్రయంలో విమానం దిగిన తరువాత బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ప్రయాణికులకు స్వాగతం పలికారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గ్వాదర్ విమానాశ్రయంలో విమానాల ఆపరేషన్లు మొదలుకావడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News