- Advertisement -
తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఉన్నానని మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు ఆదివారం ఫోన్ ద్వారా తన అనుచరులకు సమాచారం చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. బడే చొక్కారావు సమాచారంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు జరిగిన ప్రచారానికి తెరపడినట్లయింది. గత రెండు రోజులుగా మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి చెందాడన్న వార్తలు అవాస్తవం అని తేలిపోయింది.
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్లు మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరిట శనివారం విడుదలైన లేఖ నకిలీదని తేటతెల్లమైంది. ఈ లేఖతో దామోదర్ మృతి చెందాడని అందరూ అనుకున్నా ఆయన మృతి విషయాన్ని పోలీసులు ఇంతవరకూ ధృవీకరించలేదు. దీంతో దామోదర్ బతికే ఉన్నాడని తెలుస్తోంది.
- Advertisement -