మన తెలంగాణ/ఎల్‌బినగర్ : అమెరికాలో హైదరాబాద్ యువకుడి పై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్‌కెపు రం డివిజన్, గ్రీన్‌హిల్స్‌కు చెందిన కోయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మృతి చెందాడు. తమ కు మారుడి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. 2022 మా ర్చి లో అమెరికా వెళ్లిన రవితేజ మాస్ట ర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు.
అమెరికా వాషింగ్టన్‌ఏవ్ లో దుండగుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలావుండగా, విషయం తెలుసుకున్న మా జీ మంత్రి, మహేశ్వరం ఎంఎల్‌ఎ సబితాఇంద్రారెడ్డి రవితేజ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉన్నత చదువుల కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ తీసుకువచ్చేందుకు సహకారం అందించేందుకు కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.