గిఫ్ట్‌డీడ్ పేరుతో భారీ దోపిడీ
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో
గోల్‌మాల్ సాధారణ సేల్‌డీడ్
రిజిస్ట్రేషన్‌కు 7.5శాతం స్టాంప్ డ్యూటీ
అదే గిఫ్ట్‌డీడ్‌కు 3శాతమే దీనిని
అడ్డంపెట్టుకొని అనేక లావాదేవీలు
గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వానికి భారీగా పడిపోయిన
ఆదాయం తహశీల్దార్లు చేసిన
రిజిస్ట్రేషన్లపై ఆడిటింగ్‌కు
సిద్ధపడుతున్న ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : గిఫ్డ్‌డీడ్‌ను ఆసరా గా చేసుకొని వ్యవసాయ భూములకు సంబంధిం చి ధరణిలో జరిగిన రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జ రి గాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందా యి.అందులో భాగంగా ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ భూములకు సంబంధించి గిఫ్ట్‌డీడ్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్‌లపై ఆడిటిం గ్ జరగాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఇప్పటినుంచి వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్‌లకు ఆడిటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. మాములుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ లు చేసే రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఆ శాఖ నుం చి రెండు నెలలకోసారి
ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతి డాక్యుమెంట్‌కు సంబంధించి ఆడిటింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటు ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్‌డ్యూటీతో పాటు మార్కెట్‌వాల్యూను సబ్ రిజిస్ట్రార్ కచ్చితంగా వసూల్ చేశారా లేదా అన్నది ఆడిటింగ్ చేసి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తారు. దీంతోపాటు గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్లు జరిగితే ఆ రిజిస్ట్రేషన్‌ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏమన్నా నష్ట వచ్చిందా లేదా బంధుత్వం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న విషయాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆరా తీస్తారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలనే రెవెన్యూ శాఖలోనే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిఎంఓకు పలువురు ఫిర్యాదులు సైతం చేసినట్టుగా సమాచారం.
4 శాతం స్టాంపుడ్యూటీ గండి
అయితే ధరణి వచ్చిన తరువాత సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్‌లకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే గిఫ్ట్‌డీడ్ పేరుతో అప్పట్లో చాలామంది తహసీల్దార్‌లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా నష్ట వచ్చింది. అప్పటి నుంచి ఈ తంతు అలాగే కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే దానిపై ఆడిటింగ్ జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మాములుగా ప్రతి డాక్యుమెంట్‌కు సేల్‌డీడ్ కింద స్టాంపు డ్యూటీని 7.5 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే గిప్ట్‌డీడ్ కింద అయితే 3 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు తహసీల్దార్‌లు బంధుత్వం లేకున్నా చాలా రిజిస్ట్రేషన్‌లను గిఫ్ట్‌డీడ్ కింద చేసి ప్రభుత్వ ఆదాయానికి 4 శాతం స్టాంపు డ్యూటీని గండికొట్టారని సమాచారం.
దీనిపై రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు అందడంతో పూర్తిస్థాయిలో ఆడిటింగ్ చేస్తేనే ఎంతనష్టం వచ్చిందన్న వివరాలు తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు రానున్న రోజుల్లో తహసీల్దార్‌లు చేసే ప్రతి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆడిటింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించి తరువాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే ప్రభుత్వం ఆడిటింగ్ నిర్వహిస్తామంటే తహసీల్దార్‌లు ఎంతవరకు ఒప్పుకుంటారో వేచిచూడాల్సిందేనని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధరణి వచ్చిన కొత్తలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఆడిటింగ్ నిర్వహిస్తామంటే అప్పట్లో తహసీల్దార్‌లు ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడడంతో ఇప్పుడైనా తహసీల్దార్‌లు సహకరిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.