Tuesday, January 21, 2025

బిఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ చే పట్టే రైతు మహాధర్నాకు తాత్కాలిక బ్రేక్ పడింది. రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్‌ఎస్ నా యకత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో 27వ తేదీకి విచారణ వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే…‘రైతుబం ధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, రుణమాఫీలో అ న్యాయం జరిగిందని, రైతు భరోసా పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గులాబీ పార్టీ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు పిలుపునిచ్చింది. బిఆర్‌ఎస్ యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వంలో ధర్నాకు నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఏర్పాట్లలో గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. కానీ ఈ రైతుధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ బిఆర్‌ఎస్ నేతలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ధర్నా చే సి తీరుతామని, ఇది తమహక్కు.. అంటూ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము జరిపి తీరుతామంటే.. పర్మిషన్ లేదని పోలీసులు చెప్పడం తో అంతా టెన్షన్ టెన్షన్‌గా

మారింది. కానీ సభకు అనుమతి ఇవ్వడం లేదంటూ బిఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. కానీ ఈనెల 21 నుండి 24 వతేదీ వరకు ప్రభుత్వ పథకాలపై గ్రామసభలు నిర్వహిస్తుండటం.. 26వ తేదీన రిపబ్లిక్ డే ఉండటంతో పోలీస్ బందోబస్తు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుందని హోంశాఖ డిజి హైకోర్టుకు విన్నవించారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు విచారణను ఈనెల 27వతేదీకి వాయిదా వేసింది. దీంతో బిఆర్‌ఎస్ మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఓ పక్క గ్రామసభలు.. మరోపక్క మహాధర్నా నిర్వహిస్తే ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటున్న తరుణంలో ధర్నా వాయిదా వేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ జిల్లాలోని రైతులు బిఆర్‌ఎస్ నేతలను చెప్పులతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏం జరిగిందో.. హైదరాబాద్‌లో రేసుల పేరుతో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు.

‘రేసుల్లో తిరిగే మొనగాడు నల్లగొండకు వస్తాడంట.. మాజీ ఎంఎల్‌ఎ భూపాల్‌రెడ్డి ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని కొంపజపం చేసినా ప్రజలు నమ్మరు’ అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బిసి, బ్రహ్మణవెల్లంల సహా పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోందని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక నిరసన తెలుపుదామంటే అనుమతి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. కెటిఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మహాధర్నాకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News