- Advertisement -
చిత్తూరు: ఇష్టం లేని పెళ్లి చేస్తారని భావించిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కడతల్లపల్లె గ్రామంలో రవీంద్రా రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రవీంద్రా రెడ్డి తన కూతురు మైత్రికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దగ్గరి బంధువుతో పెళ్లి నిశ్చయం చేసేందుకు ఆమెను ఒప్పించారు. తనకు ఇష్టం లేదని యువతి చెప్పడంతో మరో సంబంధం తీసుకొస్తామని ఆమెకు కుటుంబ సభ్యులు చెప్పారు. తనకు ఇష్టం లేని పెళ్లి ఎక్కడ చేస్తారోనని భయపడిపోయి పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -