Tuesday, January 21, 2025

ఆ ఎంపితో రింకు సింగ్ పెళ్లి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టీమిండియా టి20 బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ ఇంటి వాడు కాబోతున్నాడు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపి ప్రియ సరోజ్‌ను రింకు పెళ్లి చేసుకోబోతున్నారని ఆమె తండ్రి, ఎంఎల్ఎ తుఫాని సరోజ్ తెలిపారు. రింకు, ప్రియకు నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తొలుత ఖండించిన ఆయన చర్చలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. రెండు కుటుంబాలు పెళ్లికి అంగికరించాయని చెప్పారు. గత సంవత్సరం నుంచి ఇద్దరు మధ్య పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. పార్లమెంటు సమావేశాల తరువాత లక్నోలో నిశ్చితార్థం జరుపుతామని ప్రియ తండ్రి తెలిపారు.  సమాజ్ వాదీ పార్టీ తరుపున మచిలీషహర్ నుంచి ఎంపిగా గెలిచారు. ఆమె గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా సేవలందించారు. ఆమె తండ్రి తుపానీ మూడు సార్లు ఎంపిగా పని చేశారు. రింకు సింగ్ ఇంగ్లాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు ఎంపికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News