- Advertisement -
హైదరాబాద్‌లో ఐటి అధికారుల దూకుడు పెంచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మైత్రి నవీన్, సిఇఒ చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప-2 సినిమా నిర్మించారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని నిర్మాత దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సిత రెడ్డి ఇళ్లలోనూ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 55 బృందాలతో ఎనిమిది చోట్ల తనిఖీలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో తనిఖీలు చేశారు. మ్యాంగో సంస్థ సింగర్ సునీత భర్త రాముకు సంబంధించింది.
- Advertisement -