Wednesday, January 22, 2025

17 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు: లక్ష్మీ మిట్టల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ కోరారు. దావోస్ లోని బెల్వేడార్ లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి టిజి భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలియజేశారు. హెచ్ఎంఇఎల్, హెచ్ పిసిఎల్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని కోరారు.  2 జిడబ్ల్యు సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఎపిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. రెండు వేల మందికి ఉపాధినిచ్చే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని మిట్టల్ కు మంత్రి లోకేష్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు పూర్తి అవకాశాలు కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారాలు అందిస్తామన్నారు.

ఎపిలో 17 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పాన్ జెవి సంయుక్త ప్రాజెక్టు అనకాపల్లి సమీపంలో రెండు దశల్లో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని  పేర్కొన్నారు. ఆర్సెలార్ మిట్టల్, భారత్ లోని గ్రీన్ కో గ్రూప్ తో భాగస్వామ్యం ఉంటుందని, గ్రీన్ కో హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని వివరించారు. 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్య అభివృద్ధి చేస్తామని, అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కు ఈ ప్రాజెక్టు పునురుత్పాదక విద్యుత్ సరఫరా చేస్తుందని లక్ష్మీ మిట్టల్ తెలియజేశారు.  ఏటా కార్భన్ ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News