Wednesday, January 22, 2025

యుఎస్ విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఫ్లోరిడా నుంచి యుఎస్ సెనేటర్ మార్కో రుబియోను విదేశాంగ శాఖ మంత్రిగా సోమవారం ఏకగ్రీవంగా ధ్రువీకరించారు. దీనితో ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో ఆమోదముద్ర పొందిన తొలి సభ్యుడు అయ్యారు. టెక్నాలజీ బదలీలకు సంబంధించి జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో మిత్ర దేశాలు వంటి యుఎస్ మిత్ర దేశాలతో సమానంగా భారత్‌ను పరిగణించాలని, భూభాగం సమగ్రతకు పెరుగుతున్న ముప్పులకు స్పందనలో భారత్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న బిల్లును నిరుడు సెనేటర్‌గా 53 ఏళ్ల రుబియో కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా తేలినట్లయితే భద్రతపరమైన సహాయం అందుకోకుండా పాకిస్తాన్‌ను నిషేధించాలని కూడా ఆ బిల్లు కోరింది.

ప్రస్తుతం ఉన్న మొత్తం 99 మంది సెనేటర్లూ రుబియోకు అనుకూలంగా వోటు వేశారు.వారిలో రుబియో కూడా ఉన్నారు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఓహియో నుంచి యుఎస్ సెనేటర్‌గా రాజీనామా చేసిన తరువాత సెనేట్‌లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. 2011 జనవరి 3 నుంచి ఫ్లోరిడా నుంచి యుఎస్ సెనేటర్‌గా ఉన్న రుబియోను చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించే యుఎస్ సెనేటర్‌గా పరిగణి స్తున్నారు. చైనాలో ప్రవేశించకుండా ఆయనపై నిషేధం ఉంది. చైనా 2020లో రెండు సార్లు ఆయనపై ఆంక్షలు విధించింది. నిఘాపై సెనేట్ సెలక్ట్ కమిటీలో అగ్రశ్రేణి రిపబ్లికన్ సభ్యుడు అయిన రుబియో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి అయిన తొలి లాటినో. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ సెనేటర్ జిమ్ రిష్ 72వ విదేశాంగ శాఖ మంత్రిగా రుబియోను స్వాగతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News