Wednesday, January 22, 2025

లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సైఫ్ అలీ ఖాన్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మంగళవారం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనని జనవరి 16న బంగ్లాదేశీ దుండగుడు ఆయన ఇంట్లోనే పలుమార్లు పొడిచి గాయపరిచాడు. దాంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఐదు రోజులుగా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందారు. సైఫ్ అలీ ఖాన్‌కు ఎమర్జెన్సీ సర్జరీ జరిగింది. సైఫ్ అలీ ఖాన్‌కు మూడు గాయాలయ్యాయని, రెండు ఆయన చేతి మీద, ఒకటి ఆయన మెడ మీద కాగా,

అతి పెద్ద గాయం ఆయన వెన్నెముక భాగానికి అయిందని డాక్టర్లు వెల్లడించారు. ఆయన వెన్నెముకలో ఉండిపోయిన పదునైన వస్తువును డాక్టర్లు తొలగించి చికిత్స చేశారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకున్నారు. జనవరి 17న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి మార్చారు. ఇదిలావుండగా నటుడిపై దాడికి పాల్పడిన బంగ్లాదేశీ దుండగుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రొహిల్లా అమీన్ ఫకీర్‌ను పోలీసులు ఆదివారం థానేలో అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News