Wednesday, January 22, 2025

హోటల్‌లో అగ్నిప్రమాదం..66మంది మృతి

- Advertisement -
- Advertisement -

వాయువ్య టర్కీలోని స్కీ రిసార్టు వద్ద ఓ హోటల్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 66 మంది చనిపోగా,పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బోలూ ప్రావిన్స్‌లోని కర్తల్‌కాయ రిసార్టులో ఉన్న 12 అంతస్థుల గ్రాండ్ కర్తల్ హోటల్ రెస్టారెంట్‌లో తెల్లవారు జామున 3.30 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎందుకు చెలరేగాయన్న విషయమై దర్యాప్తు జరుగుతోంది. భయంతో ఇద్దరు బిల్డింగ్ నుంచి దూకడంతో చనిపోయారని, గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదీన్ ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు ఏజెన్సీకి తెలిపారు. హోటల్‌లో 234 మంది అతిథులు బస చేశారని ఆయన అన్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న స్థలికి 30 అగ్నిమాపక శకటాలను, 28 అంబులెన్స్‌లను పంపించినట్టు తెలిపారు.

తగులబడిన హోటల్‌ను పొగ బాగా ఆవరించడంతో అతిథులకు మంటల నుంచి తప్పించుకునే దారి కూడా కనపడకుండా పోయిందని హోటల్‌లోనే ఉన్న స్కీ ఇన్‌స్ట్రక్టర్ నెస్మీ కెప్‌సెటుటన్ తెలిపారు. కాగా హోటల్ కప్పు, పై అంతస్తులు తగులబడుతున్న దృశ్యాలను టెలివిజన్ దృశ్యాలు చూయించాయి. కాగా ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించింది. కొరొగ్లు పర్వతాల్లో ఉన్న కర్తల్‌కాయ ప్రదేశ్ స్కీ రిసార్టుకు ప్రసిద్ధి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ రిసార్టు ఉన్న ఇతర హోటళ్లలోని వారిని కూడా ఖాళీ చేయించారు. ఇదిలావుండగా సెంట్రల్ టర్కీలోని మరో స్కీ రిసార్టు ఉన్న హోటల్‌లో గ్యాస్ విస్ఫోటన్ జరిగి నలుగురికి గాయాలయ్యాయి. ఈ అగ్నిప్రమాదం సివాస్ ప్రావిన్స్‌లోని ఇల్దీజ్ మౌంటైన్ వింటర్ స్పోర్ట్ సెంటర్ వద్ద జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయని సివాస్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News