143, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సాయిరాం శంకర్ నుండి రాబోతోన్న మరో విభిన్న కథా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిలిమ్స్ బ్యానర్‌తో పాటు గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ… “ఒక పథకం ప్రకారం’ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే ఈ కార్యక్రమానికి డైరెక్టర్, నిర్మాత, నేను ఇలా లాయర్ గెటప్‌లో వచ్చాం. ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్ని.క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్ ఇస్తుంది.
ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో చిన్న కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ‘పట్టుకుంటే పదివేలు.. ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో’ ఇదే కాంటెస్ట్. సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు స్పాట్లో పదివేలు ఇస్తారు. మీకు ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఆ కూపన్లో విలన్ ఎవరో చెప్పి.. సెకండాప్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్లో పదివేలు ఇస్తారు. ఇలా మొత్తం ఒక 50 సెంటర్స్‌లో మేము ఇవ్వబోతున్నాం”అని అన్నారు. నిర్మాత గార్లపాటి రమేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు సాయిరామ్ శంకర్ ఎంతో కష్టపడ్డారు. అలాగే వినోద్ విజయన్ ఈ సినిమాను టెక్నికల్‌గా చాలా గొప్పగా తీశారు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ… “ఒక పథకం ప్రకారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. సాయిరామ్ శంకర్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు, కో ప్రొడ్యూసర్ స్వాతి, జీను పాల్గొన్నారు.